ఈ ఏడాది తెలంగాణ విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుందని, గత ఏడాది కంటే ఇది 9.8 శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. 2025-2026 నాటికి విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు, 2034-2035 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఇంధన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
అయినప్పటికీ నాణ్యమైన విద్యుత్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటును ప్రకటించింది.