ఆయనకు ఇద్దరు భార్యలు.. రెండో భార్యకు వేరొక వ్యక్తితో లింక్.. రెండు ప్రాణాలు బలి

సెల్వి

శుక్రవారం, 10 మే 2024 (16:24 IST)
అక్రమ సంబంధం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నాగర్ కర్నూల్‌లో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మునగనూరు గ్రామంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సంఘమోని వెంకటయ్యకు ఇద్దరు భార్యలు ఉండగా రెండో భార్య అయిన తారకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో గ్రామపెద్దల సమక్షంలో ఎన్నిసార్లు విన్నవించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
ఈ విషయమై శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తారకమ్మ(34) నిద్రిస్తుండగా భర్త వెంకటయ్య(45) ఆగ్రహానికి గురై తలపై రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం భర్త వెంకటయ్య గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు