ఫ్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఫ్రాంక్ మోజులో పడిన పంచాయతీ కార్యదర్శి మహిళ వేషం వేశారు. అతన్ని పిల్లలను కిడ్నాప్ చేసే కిడ్నాపర్‌గా భావించిన గ్రామస్థలు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మహిళ వేషంలో ఉన్నది పురుషుడని గ్రహించిన కొందరు వ్యక్తులు వేణుగోపాల్‌ను పట్టుకుని పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకుని, ఠాణాకు తరలించారు. అక్కడ అతడిని విచారించగా అసలు విషయం వెల్లడైంది.
గుమ్మలపల్లికి చెందిన వేణుగోపాల్‌గా గుర్తించారు. ఫ్రాంక్‌లు చేయడం తనకు అలవాటని చెప్పారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలాంటి పిచ్చి పని ఏంటని పోలీసులు మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మరోమారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.