పర్యావరణ అనుకూల కార్యక్రమాలతో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన వెల్‌స్పన్‌

ఐవీఆర్

గురువారం, 6 జూన్ 2024 (22:34 IST)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సస్టెయినబిలిటీ, పర్యావరణ సారధ్యం పట్ల తమ నిబద్ధతను వెల్‌స్పన్‌ హైదరాబాద్‌ ప్రదర్శించింది.  అన్ని శాఖల ఉద్యోగులు ఏకతాటిపైకి రావడంతో పాటుగా మన గ్రహాన్ని కాపాడటానికి అంకిత భావంతో చేస్తోన్న తమ ప్రయత్నాలను వెల్లడించారు.
 
ప్లాంట్‌ హెడ్స్‌, అపెక్స్‌ సభ్యుల ప్రసంగాలతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత పై తమ ఆలోచనలను వారు పంచుకోవడంతో పాటుగా మన భూగోళాన్ని రక్షించుకోవడానికి చేపట్టే సమ్మిళిత కార్యక్రమాల ప్రభావాన్ని వెల్లడించారు. మొత్తం వెల్‌స్పన్‌ కమ్యూనిటీని వారి మాటలు ప్రభావితం చేయడం మాత్రమే కాదు, మన రోజువారీ కార్యక్రమాలను పర్యావరణ స్పృహతో నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తించేలా చేశాయి. 
 
ఈ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా మొక్కలు నాటే కార్యక్రమం నిలిచింది. మొత్తం 66 మొక్కలను ఇక్కడ నాటారు. ఈ సందర్భంగా వెల్‌స్పన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ తమ రోజువారీ కార్యక్రమాల ద్వారా పర్యావరణం పట్ల తమ ప్రేమ, దానిని కాపాడుకునేందుకు తమ తపనను చూపుతున్న ప్రతి ఉద్యోగికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కలిసికట్టుగా మనమంతా హరిత భవిష్యత్‌ను నిర్మించగలమన్నారు.
 
సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యునిగా, ప్రతి ఒక్కరూ పర్యావరణ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటుగా మన గ్రహాన్ని రక్షించుకోవడానికి తగిన చర్యలను తీసుకోవాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణ పట్ల వెల్‌స్పన్‌ యొక్క నిబద్ధతకు , పర్యావరణం పై సానుకూల ప్రభావం సృష్టించాలనే సమ్మిళిత ప్రయత్నాలకు  నిదర్శనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు