ఈ ఘటనలో అల్లూరి శంకర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఏనుగు సంచారం వుండటంతో ఆ ప్రాంత ప్రజలకు బీభత్సం సృష్టించింది. తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మగ ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి మీదుగా చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది.