మందుబాబులకు షాకింగ్ న్యూస్... 48 గంటల పాటు వైన్ షాపులకు బంద్.. కారణం?

సెల్వి

గురువారం, 10 జులై 2025 (22:35 IST)
జూలై 13 నుండి శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు 48 గంటల పాటు మూసివేయబడతాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా జూలై 13న ఉదయం 6 గంటల నుండి జూలై 15న ఉదయం 6 గంటల వరకు నగరంలోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎవరైనా మద్యం అమ్ముతూ.. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 
 
ఇంకా గాంధీనగర్, చిల్కలగూడ, లల్లాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్ వంటి 11 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మద్యం షాపులు బంద్ అవుతాయని ఆనంద్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు