పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రాజీవ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాలు లోకి వెళితే మంథనికి చెందిన ఆకుల వరుణ్, సౌమ్య దంపతులు. వారి పిల్లలు అఖిలేష్ కుమార్(10) శాన్వి(08)తో కలసి హైదరాబాద్ నుంచి స్వస్థలానికి కారులో బయలుదేరారు.