భారీగా గంజాయి సరఫరా.. అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు

సోమవారం, 24 జనవరి 2022 (15:54 IST)
భారీగా గంజాయి సరఫరా  చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు అయ్యింది. 265 కిలోల గంజాయిని సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 55,03,200 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో సీక్రెట్‌గా అమర్చి ఉన్న క్యాబిన్‌లో గంజాయిని తరలిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు