అర్థరాత్రి ఎక్సర్‌సైజ్ చేస్తుండగా తల్లి మందలించిందని నవమాసాలు మోసి కన్న తల్లినే కొడుకు కడతేర్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో సైకో కొడుకు సుధీర్ రాడ్‌తో తల్లిని తలపై కొట్టి చంపాడు. అడ్డు వచ్చిన చెల్లెను కూడా రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనలో సుధీర్ తల్లి పాపమ్మ మృతి చెందగా.. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతి చెందిన పాపమ్మను మార్చురీకి తరలించారు. గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.