కేవైసీ అప్డేట్ పేరుతో 9 లక్షల మోసం

సోమవారం, 28 జూన్ 2021 (20:55 IST)
హైదరాబాద్ టోలిచౌకి కి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి  బ్యాంకు అధికారిని మీడెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే కార్డు బ్లాక్ చేస్తామని చెప్పిన సైబర్ నేరగాళ్లు. నిజమే అనుకొని  కార్డు డీటెయిల్స్ చెప్పిన మహిళ అనంతరం అకౌంట్ నుంచి 9 లక్షలు మాయం.
 
మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.
 
లోన్ పేరుతో 2లక్షల 50 వేల మోసం.
 
కంపెనీల పేరుతో చెప్పి లోన్ ఇస్తామని ముందుగా డాక్యుమెంట్ చార్జి  వివిధ చార్జీల పేరుతో 2 లక్షల 50 రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు. లోన్ రాకపోవడంతో మోసపోయాం అని గమనించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు