కరోనా సోకితే బంధువులు, స్నేహితులతో పాటు గ్రామాన్నే చుట్టేసిన యువకుడు

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (22:53 IST)
సెకండ్ వేవ్ కరోనాతో జనం ఇప్పటికే వణికిపోతున్నారు. దేశంలో క్రమేపీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో జనంలో మళ్ళీ భయం పట్టుకుంది. మొదటి దశ కరోనా ఏవిధంగా అయితే ప్రజలను ఆందోళనకు గురిచేసిందో.. ఇప్పుడు అదేరకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జనం.
 
రోజురోజుకు కేసులు పెరుగుతుండడం.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో జనంలో మరింత భయం కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డిలో కరోనా సోకిన వ్యక్తిన ఏకంగా గ్రామం మొత్తం తిరిగేశాడు. 
 
సంగారెడ్డి జిల్లాలో కరోనా పేషెంట్ హల్ చల్ చేశాడు. రోడ్లపైకి వచ్చి మార్కెట్లో అందరినీ కలిశాడు. రెండురోజుల క్రితం కరోనా వచ్చిందని హోం ఐసోలేషన్లో ఉంచారు. ఇంట్లో వాళ్ళు చూడకుండా కరోనా బాధితుడు బయటకు వచ్చాడు. పిపిఈ కిట్టు ధరించి వైద్య సిబ్బంది వ్యక్తిని పట్టుకుని హైదరాబాద్‌కు పంపారు.
 
మతిస్థిమితం లేక అలా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. గ్రామస్తులందరికీ టెస్టులు చేయడానికి సిద్ధమయ్యారు అధికారులు. గ్రామంలో తనకు తెలిసిన వారందరినీ కలిశాడు. బంధువులతో మాట్లాడాడు. మార్కెట్లో మొత్తం తిరిగాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని వైద్యులు ఆంబులెన్స్‌లో ఎక్కించారు.
 
నడిరోడ్డులో మార్కెట్‌కు అతి సమీపంలో ఏం జరుగుతుందో జనానికి అర్థం కాలేదు. అయితే అతన్ని తీసుకెళ్ళిన తరువాత వైద్యసిబ్బందిని ప్రశ్నిస్తే అతనికి కరోనా సోకిందన చెప్పారు. దీంతో మరింత ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు