ఆర్మీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కుట్ర

శనివారం, 18 జూన్ 2022 (16:02 IST)
ఆర్మీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేసారు. అందుకే అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతుందన్నారు. రైల్వే స్టేషన్ల దాడుల వెనక  టీఆర్ఎస్ ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తూండటాన్ని హరీష్ రావు తప్పు పట్టారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దాడుల వెనుక టిఆర్ఎస్ హస్తం ఉంటే యూపీ లో ఎవరి హస్తం ఉన్నట్లని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, డి కె అరుణ లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అగ్నిపథ్‌ను మార్చా లని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్ని‌పథ్ యువతకు అర్థం కాలేదు అనడం హాస్యాస్ప దమని కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్గి అంటుకుందన్నారు. బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. బీజేపీ అన్ని రంగాలను ప్రయివేట్ పరం చేస్తోంది. చివరికి ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు