బల్గేరియా జాతీయోత్సవాల్లో బల్గేరియా కాన్సుల్ డాక్టర్ కిరణ్ విందు

సోమవారం, 6 మార్చి 2017 (13:17 IST)
హైదరాబాద్: బల్గేరియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2017, మార్చి నాలుగో తేదీన శనివారం బల్గేలియా రిపబ్లిక్ కాన్సుల్ డాక్టర్ కిరణ్ విందు ఏర్పాటు చేశారు. డాక్టర్ కిరణ్ హైదరాబాదులోని గోల్కొండ కోటకు సమీపాన గల హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్బులో ఈ విందు ఇచ్చారు. 500 సంవత్సరాల పాటు ఏకఛద్రాధిపత్యంగా సాగిన ఒట్టోమన్ పాలన నుంచి విముక్తి కోసం రష్యా, రోమేనియా సైన్యాల మద్దతుతో 1877-1878 మధ్య కాలంలో జరిగిన రష్యా - టర్కీష్ యుద్ధంలో బల్గేరియా విముక్తి పొందింది.
 
ప్రతి యేటా ఇదేనాడు యుద్ధంలో అమరులైన బల్గేరియా స్వచ్ఛంద స్మారక దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారతదేశంలో బల్గేరియా రాయబారి పెట్కో డోయ్ కోవ్, భారత విదేశాంగ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఫిల్మ్ చాంబర్ ప్రముఖులు, హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి