ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో వంటి రవాణా సేవలు లాక్‌డౌన్ కారణంగా ఎంతో నష్టపోయాయి. దీంతో త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రవాణా వ్యవస్థను పునరుద్దరించినట్లయితే ఇకపై సిటీ బస్సుల్లో స్టాండిగ్ జర్నికి చెక్ పెట్టే యోచనలో అధికారులు ఉన్నారు.
కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి కావున ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. ఇక మెట్రోలో 900 మంది ప్రయాణించే వీలుండగా.. ఇకపై కొద్దిమందితోనే రైళ్లను నడపాలని భావిస్తున్నారు.