ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్.. ఎక్కడ?

సోమవారం, 13 మార్చి 2023 (11:46 IST)
ఓ కండక్టర్ ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పాలమూరు జిల్లా తొర్రూరు బస్సు డిపోలో జరిగింది. ఈ మండలంలోని కంఠాయపాళెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తెలంగాణ ఆర్టీసీ బస్సు కండక్టరుగా తొర్రూరు డిపోలో పని చేస్తున్నారు. ఈయన ఆదివారం ఎప్పటిలానే విధులకు హాజరయ్యారు. ఆయన హాజరుపట్టీలో సంతకం చేసి డిపో లోపలికి వెళ్లారు. అయితే, లోపలకు వెళ్లిన మహేందర్ రెడ్డి ఎంతకీ బయటకురాకపోవడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు డిపో అంతా గాలించారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ బస్సులో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో డిపో అధికారులకు సమాచారం అందించారు. డిపో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డిపోకు వచ్చి మహేందర్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా? ఆర్థిక కష్టాలా? పని ఒత్తిడా? పై అధికారుల వేధింపులా? అనే విషయం తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు