సంగారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. రేవంత్-జగ్గారెడ్డి వర్గీయుల ఫైట్

శనివారం, 2 ఏప్రియల్ 2022 (13:46 IST)
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం చర్చకు దారితీస్తోంది. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ వర్గం, జగ్గారెడ్డి వర్గం వేర్వేరు చోట్ల ధర్నాలు నిర్వహించారు. 
 
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని వినూత్న నిరసన తెలిపారు. తలపై కట్టెలు పెట్టుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీతో ధర్నా నిర్వహించారు.
 
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి అధ్వర్యంలో మరో వర్గం నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్‌కు పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు.
 
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని, లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలు చేస్తుందని తెలిపారు. కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ పోతే సామాన్యులు బతికే పరిస్థితి లేదని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు