కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని పార్టీలకు బుద్ది చెప్పాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్
శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:45 IST)
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సియం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
శనివారం పెద్దవంగర టిఆర్ఎస్ మండల పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలు, ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంధర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులుగా ఈదురు అయిలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్...
* గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు.. ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపు.
* కరోనా వల్ల దెబ్బ తిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుతం పురోభివృద్ధి దిశగా పయనిస్తుంది.
* పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి.
* అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ.. దేశంలోనే ఆదర్శ సియంగా కేసీఆర్ నిలిచారు.
* కళ్యాణలక్ష్మి, షాధీముభారక్, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచారు.
* కరోనా కష్టకాలంలోనూ సంకేమ ఫలాలు అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.
* సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందజేసి, వ్యవసాయానికి 24గం.ల విద్యుత్, పంట పెట్టుబడి సహాయాన్ని అందజేసి రైతులకు అండగా నిలిచిన మహానీయుడు సియం కేసీఆర్.
* దళితబంధుతో పాటు విడుతల వారిగా అన్ని వర్గాలకు ఆర్థిక సహాయం.
* ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరిగింది.