ఊపిరితిత్తుల వ్యాధులున్నవారికి తమలపాకుల రసం

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:04 IST)
ఆయుర్వేదంలో తమలపాకుల ఔషధ గుణాలను విశదీకరించారు. భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడంలో వున్న రహస్యం కూడా తమలపాకుల్లో వున్న ఔషధగుణాలే. అవేంటో చూద్దాం.
 
తమలపాకు రసంతో పాటు నీరు కలిపిన పాలును చేర్చి రోజుకో కప్పు తీసుకుంటే కిడ్నీ సంబంధిత రోగాలు దూరమవుతాయి. 
 
తమలపాకు, ఆవాలు నూనెలో వేసి వేడయ్యాక దానిని గుండెపై ఉంచి కట్టుకున్నట్లైతే శ్వాసకోశ రోగాలు నయం అవుతాయి. జలుబు, దగ్గు మటుమాయం అవుతాయి.
 
పిల్లలకు వచ్చే జలుబు, జ్వరానికి తమలపాకు రసంతో కాస్త కస్తూరి, సంజీవిలో ఏదైనా ఒకదాన్ని చేర్చి బాగా నులుమి రాసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే పిల్లల్లో జలుబు, దగ్గు దూరమవుతుంది.  
 
తమలపాకును వేడి తగలనిచ్చి.. దీనితో పాటు ఐదు తులసీ ఆకులను చేర్చి.. నులిమి ఆ రసాన్ని 10 నెలల పిల్లలకు ఉదయం, సాయంత్రం ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతుంది. మోకాలి నొప్పులకు కూడా తమలపాకు రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. 
 
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. తమలపాకు రసం, అల్లం రసాన్ని సరైన పాళ్ళలో తీసుకుంటే సరిపోతుంది. పిల్లల్లో అజీర్తిని దూరం చేసి.. ఆకలి కలిగేలా చేయడంలో తమలపాకు బాగా పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు