Rohit Verma, Riya Suman Clap by Vijay kanakamedala
రోహిత్ వర్మ కథానాయకుడిగా రియా సుమన్ నాయికగా నటిస్తోన్న నూతన చిత్రం మంగళవారంనాడు హైదరాాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్.ఎల్.పి. బేనర్ లో నజీర్ జమాల్ నిర్మిస్తుండగా, గోవిందరెడ్డి చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి విజయ్ కనకమేడల క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు రామ్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు.