వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బట్టు సతీశ్, హైదరాబాద్‌లోని గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మహిమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాదులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మహిమతో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెబితే అంగీకరించరని రహస్యంగా వివాహం చేసుకున్నారు.