పనిచేయని సీఎం కేసీఆర్ మంత్రం .. 'దళితబంధు' గ్రామంలోనూ కారుకు చుక్కెదురు

మంగళవారం, 2 నవంబరు 2021 (11:36 IST)
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మంత్రం పనిచేయలేదు. తెరాస ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం కూడా తెరాస అభ్యర్థిని గెలిపించలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇటు కేసీఆర్ మంత్రం, అటు దళితబంధు పని చేయనట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం వెడువడుతున్న ఫలితాల సరళిని చూస్తుంటే ఈ విషయం తేటతెల్లమవుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సమాజికవర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 50 వేల వరకు ఉంటారు. వీరందరిపై దళితబంధు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. తెరాస పార్టీ కూడా ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
 
అయితే అంచనాలకు విరుద్ధంగా దళితబంధు ఓటర్లను ఆకట్టుకోకపోయిందనే భావన ఇప్పడు వెలువడుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. 
 
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరి సమక్షంలో భారీ బహిరంగసభలో ఈ పథకాన్ని ఆరంభించారు. పథకానికి సంబంధించి వివరాలను ఆయనే స్వయంగా వేదికపై నుంచే అందరికీ వివరించారు. అయితే, శాలపల్లిలో వెలువడిన ఫలితాను టీఆర్ఎస్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 135 ఓట్ల ఆధిక్యతను సాధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు