దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా హెగ్డేను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పూజ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చూపించే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూజ స్కూటీ నడుపుతూ, దుల్కర్ వెనుక కూర్చుని, వారి మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే సన్నివేశం ఆకట్టుకుంది.
గ్రాండ్ పాన్-ఇండియా మూవీ గా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో థియేటర్లలోకి రానుంది.