హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని, అందుకే ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు బంధువులు ఇండ్ల పై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
పోలీసులంటే ప్రజలు అస్యహించుకునేలా చేసుకోవద్దన్నారు. బీజేపీ గెలుస్తుందని సర్వేల్లో తెలుసుకున్న టీఆర్ ఎస్ అడ్డదారులు తొక్కుతున్నదని, మంత్రి హరీశ్ వ్యవహార శైలి సరిగా లేదని, ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారన్నారని మండిపడ్డారు.
ఎన్నికలు సరిగా జరిగేలా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఆహంకారం తగ్గాలంటే దుబ్బాక లో బీజేపీని గెలిపించాలని, టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని, ఒక చారిత్రక తీర్పు దుబ్బాక ఓటర్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారు.