ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలోనే నాయినికి ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్ పడిపోవడంతో అపోలో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.