80 ఏళ్ళ వృద్ధురాలి - ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారయత్నం

మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడేళ్ళ బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన 80 యేళ్ళ వృద్ధురాలిపై కూడా ఆ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈనెల 2వ తేదీన వడ్డేపల్లి మండల పరిధిలో ఏడేళ్ల బాలికను ఆమె ఇంటి పక్కన ఉండే బాలుడు బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. 
 
బాలిక కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. కూలీ పనికి వెళ్లిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరువకముందే మరో బాలుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోనే వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు