అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు- హరీష్ రావు

బుధవారం, 20 జులై 2022 (12:22 IST)
తెలంగాణలో రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే..బీజేపీ ప్రభుత్వం పేదల నుంచి దోచుకుని కార్పొరేట్లకు పంచుతోందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరికి వరదలు సంభవించాయని..ఐనా ఎలాంటి ప్రాణ నష్టం కల్గకుండా చూశామన్నారు మంత్రి హరీష్‌రావు.
 
వరదలపై బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఉండి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టారు. డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో రూ.50 కోట్లతో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, రూ.15 కోట్లతో మంచి నీటి సరఫరా అందిస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు