తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడపడినా వరద నీరు నిండిపోయింది. మూసీ నది నిండిపోయింది. నిజామాబాద్-కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి.
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి 9,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం నుంచి వాన జోరుగా కురుస్తోంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్ జిల్లాలో ఎడతెగని వర్షాలతో స్వర్ణ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది.