కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు.
కాగా.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ (15గంటల్లో) చనిపోయిన 35 మందిలో 45, ఆలోపు వయసువారు తొమ్మిది మంది ఉండడం గమనార్హం. మిగతావారంతా 46 నుంచి 83 ఏళ్ల వారు. ఈ 35 మందిలో 16 మంది మహిళలు కాగా, 19 మంది పురుషులు. కాగా, ప్రస్తుతం గాంధీలో 308 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు.