పిల్లల కదలికలపై నిఘా వుంచండి, ప్రేమ వివాహం చేసుకుంటే...?: హైదరాబాద్ సిపీ

సోమవారం, 30 మే 2022 (21:01 IST)
ఇటీవల హైదరాబాదు నగరంలో సంచలనం సృష్టించిన పరువు హత్యల నేపధ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్ మాట్లాడారు. ప్రేమ వివాహం పెద్దలకు ఇష్టంలేనట్లయితే ఆ జంటను పట్టించుకోకుండా వదిలేయాలనీ, అలా కాకుండా కక్ష పెంచుకుని హత్యలు చేస్తామంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

 
పిల్లలు కాలేజీలకో, ఉద్యోగాలకో వెళ్లినపుడు వారిపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసవుతున్నారేమోనని ఓ కంట కనిపెడుతుండాలని సూచన చేసారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుంటూ ఇలాంటి ఘటనలకు ఆస్కారం వుండదన్నారు.

 
హైదరాబాద్ బేగం బజారులో ఇటీవల నీరజ్ అనే వ్యక్తిని హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో తమ పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ నేపధ్యంలో నీరజ్ భార్యను, ఆమె కుటుంబ సభ్యులను సీపీ ఆనంద్ పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు