అక్కడ మరోసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య తలెత్తడంతో బాధితురాలు మళ్లీ హైదారబాద్‌కు తిరిగి వచ్చింది. మళ్లీ అదే ఆసుపత్రికి వెళ్లి నిందితుడైన వైద్యుడిని సంప్రదించింది. చెకింగ్ సమయంలో డాక్టర్ మళ్లీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడంతో బాధితురాలు.. అతని దుర్భుద్దిని పసిగట్టింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి డాక్టర్‌పై ఫిర్యాదు చేసింది.
పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డాక్టర్ బాగోతం నిజమని తేలడంతో పోలీసులు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన నాంపల్లి సెషన్స్‌కోర్టు జడ్జి కె.కవిత నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.