జెఈఈ మెయిన్స్‌ 2022: 99కు పైగా పర్సంటైల్‌ను సాధించిన 17 మంది హైదరాబాద్‌లోని ఆకాష్‌బైజూస్‌ విద్యార్థులు

మంగళవారం, 9 ఆగస్టు 2022 (23:04 IST)
ఆకాష్‌ బైజూస్‌, హైదరాబాద్‌ లోని పలు కేంద్రాలకు చెందిన 17 మంది విద్యార్ధులు ఇనిస్టిట్యూట్‌కు మాత్రమే కాకుండా  నగరానికి సైతం  గర్వకారణంగా నిలుస్తూ 99 పర్సంటైల్‌‌కు పైగా మార్కులను జెఈఈ మెయిన్స్‌ 2022 పరీక్షల రెండవ సెషన్‌లో సాధించారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ సంస్థ నిన్న వెల్లడించింది. ఈ సంవత్సరం ఇంజినీరింగ్‌ కోసం నిర్వహించనున్న రెండు ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో ఇది చివరిది.
 
టాప్‌ స్కోరర్లలో అశ్రిత చెకోటీ 99.27 స్కోర్‌ సాధించగా మంటిపల్లి మహేష్‌ 99.21; దివ్యాంష్‌ పాండే 99.21, అన్షు జయంతి 99.21; అమిత్‌ కుమార్‌ పాధి 99.21తో పాటుగా తాడికొండ నాగసాయి బాలాజీ, ఆదిత్య, గౌతమి బెరెల్లీ, వై శరణ్‌ శ్రీరామ్‌ రెడ్డి, శ్రీజ గంగుల, ఆదిత్య కుమార్‌ సింగ్‌, నిషిత కన్నన్‌, నవీన్‌ తన్నీరు, గిల్డా ఉద్దవ్‌ నారాయణ్‌, తపేష్‌ లహోత్రా, గరిమా కేతన్‌ చౌహన్‌, ఆకాష్‌ రెడ్డి కొంతం ఉన్నారు.
 
ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న ఐఐటీ జెఈఈలో విజయం సాధించేందుకు ఈ విద్యార్థులు ఆకాష్‌ బైజూస్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ కోసం చేరారు. కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోవడంలో తాము పడిన కష్టం, లెర్నింగ్‌ షెడ్యూల్స్‌కు కట్టుబడి ఉండటమే టాప్‌ పర్సంటైల్‌ సాధించిన ఎలైట్‌ జాబితాలో చోటు సంపాదించుకోవడానికి కారణంగా అభివర్ణించారు. ‘‘ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌కు మేము ధన్యవాదములు చెబుతున్నాము. వారు  మాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు. కంటెంట్‌, కోచింగ్‌ పరంగా వారి తోడ్పాటు లేకుండా అతి తక్కువ సమయంలో విభిన్న బోధనాంశాలలో మేము ఎన్నో కాన్సెప్ట్‌లను ఒడిసిపట్టలేము’’ అని విద్యార్థులు అన్నారు.
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌  బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, శ్రీ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులందరినీ అభినందిస్తున్నాను. జెఈఈ మెయిన్‌ 2022 రెండవ సెషన్‌  కోసం దేశవ్యాప్తంగా 7 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. స్టేట్‌ టాపర్‌ మరియు పర్సంటైల్‌ టాపర్స్‌గా వారు సాధించిన విజయం, వారు పడిన కష్టం, అంకితభావం మరియు వారి తల్లిదండ్రులు అందించిన మద్దతు గురించి ఎంతో వెల్లడిస్తుంది.  భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన విద్యాసంవత్సరాలలో విద్యార్థులు జెఈఈలో టాప్‌ పర్సంటైల్‌ స్కోరర్స్‌గా నిలిచేందుకు ఆకాష్‌ బైజూస్‌ అదనపు ఏర్పాట్లు చేసింది.
 
మా విద్యార్థులకు డిజిటల్‌గా ఎప్పుడూ అందుబాటులో ఉండేలా  ఏర్పాట్లు చేశాము. అలాగే  స్టడీ మెటీరియల్స్‌, క్వశ్చన్‌ బ్యాంక్‌లను సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాము. వర్ట్యువల్‌గా పలు స్ఫూర్తిదాయక సదస్సులు నిర్వహించడంతో పాటుగా పరీక్షల ప్రిపరేషన్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌  నైపుణ్యాలను గురించి సెమినార్లను నిర్వహించాము. మేము పడిన కష్టానికి తగిన  ప్రతిఫలం లభించడం పట్ల ఆనందంగా ఉన్నాము. మా విద్యార్థుల స్కోర్‌ షీట్స్‌ పరిశీలించిన మీదట  ఎంతోమంది విద్యార్థులు టాప్‌ ఐఐటీ లేదా ఎన్‌ఐటీ లేదా కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పొందడంతో పాటుగా  తమ ప్రాధాన్యతా ఉన్నత విద్యనభ్యసించగలరు’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు