కుమారుడు సీఏలో ర్యాంక్ సాధించలేదని తల్లి ఆత్మహత్య

గురువారం, 10 ఆగస్టు 2023 (12:09 IST)
హైదరాబాద్‌లోని గాజులరామారం బాలాజీ నగర్ ఎన్‌క్లేవ్‌లో తన కొడుకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుమారుడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని గాజులరామారం బాలాజీ నగర్ ఎన్‌క్లేవ్‌కు చెందిన ఓ మహిళ తన కొడుకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంకా ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 
 
మృతురాలు పుష్పజ్యోతి (41) అనే గృహిణి బుధవారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 
 పోలీసుల విచారణలో పుష్ప భర్త ప్రైవేట్ ఉద్యోగి అని.. కుమారుడు సీఏలో ర్యాంక్ సాధించలేదనే మనస్తాపంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వారిలో ఒకరు ఇటీవల సీఏ పరీక్షకు హాజరయ్యారని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు