సిమ్‌కార్డులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారంటూ దర్యాప్తు సంస్థలతో పాటు ట్రాయ్ కూడా దృష్టి సారించింది. ఒకవేళ కొనుగోలు చేసిన సిమ్‌కార్డుల ఆధారాలు నేరుగా లభించకుంటే, విదేశాలలో యాక్టివేట్ అయినా.. అక్కడ నుంచి ఇక్కడికి జరిగిన కాల్స్, ఇతర కమ్యూనికేషన్ లింకులపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కూడా ఈ విషయంలో దృష్టి సారించినప్పటికీ, హైదరాబాద్ లింకుల గురించి స్పష్టమైన సమాచారం వస్తేనే తదుపరి విచారణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు 2010-11 కాలంలో సిమ్‌కార్డులు విక్రయించిన తీరుపై కూడా వారు ఆరా తీస్తున్నారు.