గురువారం న్యూజిలాండ్ సరిహద్దుల్లో చేపట్టిన పరీక్షలో 23 మందికి కరోనా సోకగా..అందులో 17 మంది భారత్ నుండి వచ్చిన వారే. దీంతో భారత్ నుండి న్యూజిలాండ్‌కు వచ్చే పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో కూడా సెకండ్ వేవ్ నడుస్తుండటంతో పాటు కొన్ని రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి విదితమే.