చైనా విడిగా ఇప్పటికే సినో వాక్‌తో సహా నాలుగు రకాల వ్యాక్సిన్లను తయారు చేసి వివిధ దేశాలకు సరఫరా చేసింది. క్యూబా కూడా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో'సెబరోనా-02' అనే టీకాను రూపొందించింది, మూడో దశ పరీక్షలను కూడా పూర్తి చేసుకుని, తర్వలోనే అది ప్రజలకు అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉంది.
అయితే, కరోనా వైరస్ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుండడంతో కోవిడ్ వేరియంట్లు వంటివి విజృంభిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైరస్ ఎన్ని అవతారాలెత్తినా, దానిని సమర్థవతంగా అరికట్టేలా చైనా- క్యూబా కనిపెట్టే కొత్త వ్యాక్సిన్ వుండబోతుందని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
సెంటర్ ఫర్ జెనిటిక్ ఇంజనీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (సిఐజిబి)లో బయో మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ అయిన గెరార్డో గిలెన్ మీడియాతో మాట్లాడుతూ, చైనా నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. క్యూబా సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా లభించిందన్నారు.