హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్, మైహోం రామేశ్వరావు ఇచ్చే కమిషన్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కక్కుర్తి పడ్డారని రేవంత్ ఆరోపించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రామేశ్వరరావు భేటీ కావడం వెనుక కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారని చెప్పారు. జైజ్యోతి సిమెంట్ కంపెనీని తిరిగి తెరిపించి… రామేశ్వరరావుకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికే ఇదంతా అని అన్నారు.