ఫిబ్రవరి 18న ఎందుకు అంటే ఆ రోజు రథసప్తమి. హైందవ సంప్రదాయంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని సూర్యజయంతి, వైవస్వత మన్వాది అని కూడా పిలుస్తారు. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు పుట్టిన రోజుగా దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా కొనసాగుతాయని నమ్మకం. అలాంటి రోజున కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం.
ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19న రెండు రోజులు కూడా సప్తమి తిథి ఉంది. ఒకరోజు ఎక్కువ సమయం, మరో రోజు తక్కువ సమయం ఉంది. అలాగే, ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ జయంతి. రెండు కలసి వచ్చేలా ఫిబ్రవరి 19న కూడా చేసే అవకాశం ఉంది.