ఉదయం పాట్నాలో ఫ్లైట్ ఎక్కాడు.. సాయంత్రం హైదరాబాద్‌లో పనికానిచ్చాడు..?

గురువారం, 15 నవంబరు 2018 (19:15 IST)
అది హైదరాబాద్‌లోని సనత్ నగర్ ఏరియా. కోడి కూస్తోంది. ఒక్కసారిగా ఏడుపు వినిపిస్తోంది. దీంతో ఇంటి ఓనర్ మొదటి అంతస్తులోకి పరుగున వచ్చాడు. ఇంటిలో కాపురమున్న వ్యక్తి చనిపోయాడు. అతని భార్య ఏడుస్తూ కనిపించింది. ఏమైందని ప్రశ్నించాడు ఇంటి ఓనర్. మా ఆయన చనిపోయాడంటూ బోరున విలపిస్తూ చెప్పింది వివాహిత. దీంతో పోలీసులకు ఫోన్ చేశాడు ఓనర్. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మరణించిన వ్యక్తి సహజ మరణం కాదని హత్య అని తేల్చారు. 
 
మరణించిన వ్యక్తి పేరు మంగళ్ దాస్, భార్య పేరు మాలతి. తొమ్మిది సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్య మాలతిని నెల రోజుల క్రితమే హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు మంగళ్ దాస్. అంతకుముందు నుంచి బీహార్ లోనే ఉండేది మాలతి. వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో సెటిలైన మంగళ్ దాస్ భార్యను కొన్ని సంవత్సరాల పాటు బీహార్‌లోనే ఉంచాడు. బీహార్‌లో ఒంటరిగా ఉండే మాలతి తనకు వరుసైన మరిది నీరజ్‌తో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఎప్పుడూ భార్యకు చెప్పి బీహార్‌కు వచ్చే మంగళ్ దాస్ ఒకరోజు ఉన్నట్లుండి ఇంటికి వెళ్ళాడు. మాలతి ఇంట్లో లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి వుంది. రోడ్డు వెంట చూసుకుంటూ వెళ్ళిన మంగళ్ దాస్ ఒక పార్కులో తన భార్య వేరొక వ్యక్తితో కలిసి ఉండడాన్ని చూశాడు. షాకయ్యాడు. ఇదేంటని ప్రశ్నించాడు. మాలతి కూడా గద్గద స్వరంతో బదులిచ్చింది. పెళ్ళయిన తరువాత తొమ్మిది సంవత్సరాల్లో అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నావు. నాకు కోరికలు ఉంటాయని చెప్పింది. నీరజ్‌ను కలవడం ఇదే మొదటిసారని కూడా బదులిచ్చింది. దీంతో మంగళ్ దాస్ తన భార్యను హైదరాబాద్ తీసుకెళ్ళాడు. ఒకే ఒక్క వారం రోజుల పాటు భర్తతో ఉన్న మాలతి ఆ తరువాత ప్రియుడికి ఫోన్ చేసి హైదరాబాదుకు రమ్మంది. 
 
ఒక పథకం ప్రకారమే ఉదయం పాట్నా నుంచి ఫ్లైట్ ఎక్కిన నీరజ్ రాత్రికి మాలతి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న మంగళ్ దాస్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు పాట్నాకు వెళ్ళిపోయాడు. అయితే తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని మాలతి పోలీసులకు తెలిపింది. పోస్టుమార్టం రిపోర్టులో హత్య అని తెలియడంతో మాలతిని గట్టిగా ప్రశ్నించారు పోలీసులు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పేసింది మాలతి. ప్రియుడు నీరజ్‌తో పాటు మాలతిని పోలీసులు అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు