పాలు పితికి ఆ పాలతోనే పాలాభిషేకం చేయించుకున్న ఎంపి(ఫోటోలు)
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (21:41 IST)
దుంధాం డ్యాన్స్‌లతో అదరగొట్టే మాల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తానే స్వయంగా ఆవుపాలు పిండి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆవు పాలు పిండుతున్న మాల్లారెడ్డిని చూసిన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురైనారు.
అంతేనా తాను పిండిన పాలతో తనకు అభిషేకం చేయాలంటూ కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు పాలభిషేకం చేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయారు ఎంపి మాల్లారెడ్డి.
మల్లారెడ్డి వింత ప్రవర్తన కార్యకర్తలకు, నాయకులకు విస్మయానికి గురిచేసింది. పాల వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగిన మల్లారెడ్డి చివరకు తానే స్వయంగా పిండిన పాలతో అభిషేకం చేయించుకుని కోరిక తీర్చేసుకున్నాడని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.