అర్థరాత్రి భార్యతో రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త ఏం చేశాడంటే?

ఆదివారం, 1 నవంబరు 2020 (13:46 IST)
మహిళలపై అకృత్యాలు ఓవైపు.. మరోవైపు వివాహేతర సంబంధాలు. దీంతో నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె భర్త రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగారం గ్రామానికి చెందిన సాల్మన్‌ రాజు (24) ఏడాదిగా స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లంబర్‌ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితతో సాల్మన్‌ రాజు రాసలీలలు సాగిస్తూ ఆమె భర్త ఉమాకాంత్‌ కంటపడ్డాడు.
 
దీంతో రగిలిపోయిన ఉమాకాంత్‌ పక్కనే ఉన్న రాడ్డుతో సాల్మన్‌ రాజు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఉమాకాంత్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు