తెలంగాణాలో కూల్ రూఫ్ గృహాలు... మంత్రి కేటీఆర్

సోమవారం, 3 ఏప్రియల్ 2023 (16:31 IST)
పర్యావరణ మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక పోతున్నారు. ఈ ఎండల వేడిమి నుంచి తప్పించుకునేందుకు కూల్ రూఫ్ టాప్‌ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మన నంగరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో గృహాలు, ఆఫీసులు, వాణిజ్య భవనాలలో కరెంట్ వాడకం పెరిగిపోతుందని చెప్పారు. దీంతో కరెంట్ బిల్లు భారీగా వస్తుందని వివరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కూల్ రూఫ్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ విధానం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
కూల్ రూఫ్ వల్ల మీటర్‌కు కేవలం రూ.300 మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గి ఆ మెరకు బిల్లు కూడా తగ్గుతుందని చెప్పారు. కూల్ రూఫ్‌కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని ఆయన వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు