ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వీసా రద్దు, ముస్లింలకు ప్రవేశం లేదు అంటూ దురుసు నిర్ణయాలతో ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలా బ్రేకులెయ్యాలో తెలియక ఇతర దేశాల ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రంప్ ఆంక్షల అమలు అంత సులభం కాదని.. అందుకు సెనెట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
శనివారం కలెక్టరేట్‌లో కేటీఆర్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో 24 గంటల తాగునీటి సరఫరాకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దశలవారీగా మిగతా కార్పొరేషన్లలోనూ 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని హామి ఇచ్చారు. 2018లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు.