ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాల పంపిణీ

శుక్రవారం, 14 జులై 2023 (08:53 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూముల పట్టాలను ఆ రాష్ట్ర అధికారులు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాలను తహసీల్దార్ అందజేశారు. 
 
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొంది. అర్హులైన అడవి బిడ్డలకు పోడు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అటవీ భూములపై హక్కుల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ గత నెల చివరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. తెలంగాణవ్యాప్తంగా 1,15,146 మంది గిరిజనులకు 4,06,369 ఎకరాలపై హక్కు పట్టాలు అందజేయాలని నిర్ణయించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు