నిజామాబాద్: ఫుడ్‌ పాయిజన్‌.. 80మంది విద్యార్థులకు అస్వస్థత

మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
 
జిల్లాలోని భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో సోమవారం రాత్రి భోజనం చేశాక వాంతులు, కడుపునొప్పితో పలువురు విద్యార్థినులు ఫుడ్‌ పాయిజన్‌గా మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
 
మొత్తం 78 మంది విద్యార్థులు భీమ్‌గల్, నిజామాబాద్‌లోని ఆసుపత్రులలో చేరారని, ఇది తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ కేసు అని అధికారి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు