ప్లీజ్ పవన్.. తెలంగాణ నుంచి పోటీ చేయొద్దు.. ఎవరు?

మంగళవారం, 2 జనవరి 2018 (18:03 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవడం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఒక పార్టీ అధినేత మరో పార్టీ అధినేతను కలవడమే కాదు.. చాలాసేపు చర్చలు జరుపుకోవడంపై ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. అయితే వీరి మధ్య కొన్ని సంభాషణలే కాదు.. ఎన్నో ఆసక్తికరమైన సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. 
 
జనసేన పార్టీని స్థాపించిన తరువాత పవన్ కళ్యాణ్‌ మొదటగా ఎపిలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత మళ్ళీ తెలంగాణాలో కూడా పోటీ చేస్తానని చెప్పారు. ఏపీ వరకు బాగానే ఉన్నా తెలంగాణాలో జనసేన పోటీ చేయడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్న టిఆర్ఎస్‌ను కాదని వేరే పార్టీ ఇమడగలిగే పరిస్థితి లేదని జనసేనలోని కొంతమంది కీలక నాయకులు పవన్ కళ్యాణ్‌‌కు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్‌ తను తీసుకున్న నిర్ణయానికే ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆయనను అసలు వెనక్కి తగ్గరని అందరికీ తెలిసిందేగా.
 
అయితే తాజాగా కెసిఆర్‌ను కలిసిన తరువాత ఆయన కూడా ఇదే ప్రశ్న వేశారట. తెలంగాణాలో పోటీ చేయొద్దని పవన్ కళ్యాణ్‌‌ను కోరారట కెసిఆర్. ఇక్కడ మాకు బాగుంది. మేము అన్ని విధాలుగా తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. మా నుంచి మీకు ఎలాంటి సపోర్టు కావాలన్నా ఇస్తాము. దయచేసి ఈ ఒక్క నా కోరికను మన్నించు అంటూ కెసిఆర్, పవన్ కళ్యాణ్‌‌ను కోరారట. అయితే తనకు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వ పనితీరును పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో పోటీ చేసే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు