పెర్‌ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి.. టపాసులు పేలుస్తూ హడల్.. లాక్డౌన్ లేదా?

బుధవారం, 26 మే 2021 (12:06 IST)
లాక్డౌన్ సమయంలో జరిగిన ఓ వివాహం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. పాతబస్తీలో దుబ్బె పెర్‌ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. లాక్ డౌన్ సమయంలో టపాసులు పేలుస్తూ.. హడల్ ఎత్తించారు. కనీసం సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోకుండా వివాహ వేడుక జరిగింది. కమటి పుర పీఎస్ పరిధిలోని సవేర ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్ళికి వందలాది మంది హాజరయ్యారు. వీరిలో వీవీఐపీ, వీఐపీలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
 
దగ్గరుండి మరీ పెళ్లికి సౌత్ జోన్ పోలీసులు సెక్యురిటీ కల్పించారు. సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన పెళ్లి వేడుకలకు హోమ్ మంత్రి మహుమద్ అలీ కూడా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో చర్చకు దారితీసింది. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదేంటి అక్కడ లాక్ డౌన్ లేదా అని అడుగుతున్నారు.
 
కరోనా సెకండ్ వేవ్‌లో మరీ ఇంతలా ప్రవర్తించడం సరికాదంటున్నారు. సామాన్య జనం రోడ్లపైకి వస్తే.. ఆంక్షలు విధిస్తారు. మరీ ఈ పెళ్లి సంగతేంటి అని అడిగారు. దీనిపై మీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీలకు ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్ ట్విట్ చేశారు. అంజదుల్లాఖాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు పోలీసులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు