ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:00 IST)
యోగా, ప్రాణాయామం.. ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు.
 
ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ‘‘మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతి. ప్రజాసేవలో ఉండే అధికారులు పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటాంచాలి. కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం.
 
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్నారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి’’ అని మోదీ పేర్కొన్నారు. మొత్తం 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు