హైదరాబాదు నగరంలో ఐపీఎస్‌లకు పోస్టింగులు

శనివారం, 5 మార్చి 2022 (16:17 IST)
హైదరాబాదు నగరంలో పలువురు ఐపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టులు ఇచ్చింది. సైబరాబాద్ డీసిపి విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఆయనను డీజిపికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

 
సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రను, సౌత్ జోన్ డీసీపిగా చైతన్యను, ఈస్ట్ జోన్ డీసీపిగా సతీష్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా డీసీపి విజయ్ కుమార్ ను ఉన్నఫళంగా ఎందుకు బదలీ చేసారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

 
కాగా ఈ బదిలీలు సర్వసాధారణంగా జరిగేవేనని అధికారులు చెపుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు