తెలంగాణలో మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు

శనివారం, 24 ఏప్రియల్ 2021 (20:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో వానలు పడుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 
 
శుక్రవారం మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరిత ద్రోణి బలహీనపడిందని తెలిపారు. ఇవాళ తూర్పు, ఉత్తర ఉపరిత ఆవర్తన మరాఠ్వాడా నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు ఆవర్త ఏర్పడిందని వివరించారు.
 
దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా.. శనివారం మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు