ఈనాడు-ఈటీవీ గ్రూపు సంస్థల అధినేత, మీడియో మొఘల్ రామోజీరావు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వెన్నునొప్పి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఐతే మంగళవారం నాడు సమస్య మరీ తీవ్రం కావడంతో ఆయనను నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.